26 ఓవర్లలో టీమిండియా 136 రన్స్ 9 వికెట్లు
ఆస్ట్రేలియా : పెర్త్ వేదికగా ఆదివారం ప్రారంభమైంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్. నిర్ణీత 50 ఓవర్లకు గాను వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి అంపైర్లు మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. దీంతో టీమిండియా నిర్దేశించిన ఓవర్లలో బ్యాటర్లు నిరాశ కు గురి చేశారు. కేవలం 136 పరుగులు మాత్రమే చేశారు. 9 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. టాప్ ఆర్డర్ అంతా విఫలం అయ్యారు. ఆదుకుంటాడని అనుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ , అయ్యర్ అంతా రెండు అంకెల స్కోర్ చేయకుండానే వెనుదిరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇది మన జట్టేనా అని విస్తు పోయారు. మరో వైపు ఆసిస్ బౌలర్లు అద్బుతమైన బంతులతో బెంబేలు పుట్టించారు. ఇక రోహిత్, కోహ్లీలు దుమ్ము రేపుతారని అనుకుంటే వారు కూడా షాట్స్ ఆడబోయి వికెట్లను సమర్పించుకున్నారు.
కెప్టెన్ గిల్ కూడా నిరాశ పరిచాడు. 20 పరుగులకే 3 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కేఎల్ రాహుల్ ఒక్కడే రాణించాడు. 30 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 8 రన్స్ చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ క్వార్టర్ లెంగ్త్ నుండి బంతి విసరడంతో షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు..పెవిలియన్ బాట పట్టాడు. తను పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. మరో వైపు మైదానంలో కెప్టెన్ గిల్ ఆశలు పెంచేలా చేశాడు. కానీ తను కూడా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ కు డౌన్ ది లెగ్ సైడ్ క్యాచ్ ఇచ్చాడు. 14 వ ఓవర్ లో ఇండియా 4 వికెట్లకు 45 రన్స్ చేసింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 31 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, పటేల్ ఇద్దరూ కలిసి 39 పరుగులు చేశారు. మరో వైపు రాహుల్, వాషింగ్టన్ సుందర్ లు ఆరో వికెట్ కు 30 రన్స్ చేశారు.








