జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

పిలుపునిచ్చిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తామ‌ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌న్నారు మోసం కాంగ్రెస్ నైజం అని ఆరోపించారు.
మాటలు బోగస్, హామీలు బోగస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కు తుంద‌న్నారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉందిన్నారు. కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేశార‌ని అన్నారు. కాంగ్రెస్‌ను జూబ్లీహిల్స్‌లో ఓడించాల‌ని పిలుపునిచ్చారు. ఆనాడు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బస్సు యాత్ర చేశార‌ని, ఇప్పుడు ఓడించేందుకు మ‌రో యాత్ర చేప‌ట్టాల‌న్నారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలని కోరారు. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్‌కు అర్థం కావాల‌ని అన్నారు. తనతప్పు తాను తెలుసు కునేందుకు మనం కాంగ్రెస్‌ను ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు హ‌రీశ్ రావు. జీవో 29, జీవో 55 పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాన‌ని చెప్పారు. భట్టి దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే సోయి ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు హ‌రీశ్ రావు. విద్య శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడ‌ని, కానీ వ‌సూళ్లు, క‌లెక్ష‌న్స్ లో సక్సెస్ అయ్యాడ‌ని ఎద్దేవా చేశారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *