స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీపై. ఈ దశాబ్దం ఆయనదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపు ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విజయ వంతమైందని అన్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల కోసం ఆ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తానని నాయుడు చెప్పారు. సీఎం పీటీఐతో ప్రత్యేకంగా చిట్ చాట్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు.
సామాన్య ప్రజలకు సాధికారత కల్పించే లక్ష్యంతో సామాన్యుల ప్రయోజనం కోసం అనేక సంస్కరణలను తీసుకువస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్’ పాలన కారణంగా. ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్రతిపాదిత సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల (ప్రారంభ సామర్థ్యం) ఉక్కు కర్మాగారానికి వచ్చే నెలలో పునాది రాయి వేయనున్నట్లు నాయుడు చెప్పారు. “భారతదేశంలో, చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయని అన్నారు 2000 నుండి ప్రధానమంత్రి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు సీఎం. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చారని స్పష్టం చేశారు . గతంలో, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుండి, 11 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరో నాలుగు సంవత్సరాలు ఆయన అక్కడే ఉంటారని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.






