పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే ప‌ర్మిష‌న్

స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత

పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత. వారికి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం బొక్సoపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో రూ.7 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. దేశ విదేశాలకు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి ఫలితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వ‌స్తున్నాయన్నారు ఎస్. స‌విత‌. ఇందుకు ఉదాహరణ విశాఖలో రూ.లక్షా 33 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందమేనన్నారు. కేవలం పెద్ద పరిశ్రమల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సైతం ప్రోత్సాహిస్తున్నారన్నారు. యువత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సకాలంలో అనుమతులిస్తోందని వెల్లడించారు. అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తోందన్నారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *