పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లా : కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టలేదని వెల్లడి.. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారు ఈ ఇద్దరు. .. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్. రోడ్డు మీద చెరో వైపు పడిపోయిన శంకర్, ఎర్రిస్వామి. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా స్పాట్‌లో మృతి చెందాడు శంకర్. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఎర్రి స్వామి.
కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వెళ్లిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు.. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్లింది బస్సు. బస్సు ప్రమాదంతో భయపడి పారిపోయిన ఎర్రిస్వామి.. సీపీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా ఈనెల 24న అర్ధరాత్రి 3 గంటల నుండి 3.30 గంటల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణీకులు. మరో వైపు అదృష్టం బావుండి 21 మంది బతికి బయట పడ్డారు. ఈ ఘటనపై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు బస్సుకు సంబంధించి ఫిట్ నెస్ సరిగా లేదని తెలిసింది. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.






