నవీన్ యాదవ్ గురించి అనుచిత కామెంట్స్
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కేసీఆర్ కు తెలంగాణ భావజాల ఉద్యమాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ , తన సొంత ఇంటి నే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కెసిఆర్ కు రాజకీయంగా అండదండలు అందించిన టైగర్ నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య నుండి ఈటల రాజేందర్ వరకు వారిని ఉపయోగించుకుని తర్వాత అవమానకరమైన రీతిలో వ్యవహరించిన పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు.
భూ కబ్జాలకు పాల్పడి సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ల పై అక్రమ కేసులు బనాయించి అందరి జీవితాలతో ఆటలాడుకునీ ఇద్దరు భార్యలతో రోడ్డుకెక్కి, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని తన్నుకొని దౌర్జన్యానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వాళ్ల దృష్టిలో మంచోడు గా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా నిలబడి అందరి కష్టసుఖాల్లో ఒకరిగా జీవించి తమ వృత్తిని నమ్ముకుని నిజాయితీగా జీవించిన బీసీ బిడ్డలైన చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన కుమారుడు నవీన్ యాదవులను మాత్రం టిఆర్ఎస్ నేత కేసిఆర్ రౌడీ షీట్ లుగా పేర్కొనడం తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలను అవమానించడమేనని ఆరోపించారు.






