కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజ‌యం

అధ్య‌క్షుడిగా ఎన్నికైన వి. శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ : హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా కొన‌సాగాయి. ఓ వైపు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుండి భార‌త ట్రేడ్ యూనియ‌న్ త‌ర‌పున మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ బ‌రిలో నిల‌వ‌గా ప్ర‌త్య‌ర్థి గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యులు ర‌ఘ‌నంద‌న్ రావు పోటీ చేశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది. కానీ చివ‌ర‌కు బీఆర్ఎస్ మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ ఘ‌న విజ‌యాన్ని సాధించారు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటారు. ర‌ఘునంద‌న్ రావును చిత్తుగా ఓడంచారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.

గుర్తింపు యూనియ‌న్ కు త‌న‌ను అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నందుకు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ సంతోషం వ్య‌క్తం చేశారు. పెద్ద ఎత్తున కార్మికుల‌తో క‌లిసి విజ‌యోత్స‌వాలు జ‌రుపుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు గౌడ్. MTAR కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్ ను 30% నుండి 50% కు పెంచడం జరిగిందని తెలిపారు. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు, కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో MTAR కంపెనీ BRTU యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *