విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
అమరావతి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒకటి నుండి ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.కృష్ణా జిల్లాలో 27, 28, 29 వ తేదీలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 27, 28వ తేదీలలో రెండు రోజులు సెలవు ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో 27, 28వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కడప జిల్లాలో 27, 28వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు.
బాపట్ల జిల్లాలో 27, 28, 29వ తేదీలలో మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా 27, 28, 29 మూడు రోజులు ఇవ్వగా అనకాపల్లి జిల్లాలో 27,28,29 వ తేదీలలో మూడు రోజులు సెలవులు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో 27, 28, 29, 30, 31వ తేదీలలో ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఏలూరు జిల్లాలో 27, 28వ తేదీలలో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 27న ఒక్క రోజు సెలవు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 28, 29 వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు.






