సమీక్ష చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు . సోమవారం అమరావతి లోని సచివాలయంలో సమీక్ష చేపట్టారు . ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను . మొంథా తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించామని తెలిపారు. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సీఎం.






