స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

మొంథా తుపాను ప్ర‌భావంపై స‌మీక్ష

అమ‌రావ‌తి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఫోక‌స్ ఉండేలా చూడాల‌ని సూచించారు. సోమ‌వారం స‌చివాల‌యంలో హుటా హుటిన స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో పాటు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం. ఇదే స‌మ‌యంలో దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ మొంథా తుపాను విష‌యంపై ఫోన్ చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి.

ఈ సంద‌ర్బంగా ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి త‌న‌ను ఆదేశించిన‌ట్లు స‌మీక్ష అనంత‌రం చెప్పారు నారా లోకేష్‌. చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలపై ప్రతి గంటకు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని కోరారు. తుపాను బాధితులకు ఎటువంటి సాయం అవసరమైనా వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24×7 సిద్ధంగా ఉందన్నారు నారా లోకేష్.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *