ఆందోళన చెందవద్దని సూచన
అమరావతి : ఏపీలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను దెబ్బకు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ముందస్తుగా విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన రాత్రి అత్యవసరంగా సమీక్ష చేపట్టారు ఉన్నతాధికారులతో. ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, అనిత వంగలపూడి, నారాయణ, నిమ్మల రామా నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్లో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి తుఫాను తీవ్రత పెరగనన్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, గ్రామాలలో ప్రజలను దీని ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు.






