విజయవాడలో జనవరి 2 నుంచి 7 వరకు
అమరావతి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2 నుంచి 7 వరకు ఈ 36వ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దక్షిణ భారత దేశంలోని పుస్తక పబ్లిషర్లు, ప్రింటర్లు, పాఠకులు పెద్దఎత్తున హాజరు కానున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అందరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించటంపై బుక్ ఫెస్టివల్ సొసైటీని సీఎం అభినందించారు. పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా కావాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు.
ప్రభుత్వం ప్రత్యేకించి గ్రంథాలయాలకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. ఈసందర్బంగా బుక్ ఎగ్జిబిషన్ ను నిర్వహించడం తనకు సంతోషం కలిగించిందన్నారు. ఓ వైపు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా ఎక్కడా పుస్తకాల ప్రాధాన్యత పెరుగుతోందే తప్పా తగ్గడం లేదన్నారు. రాను రాను పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇది మరింత తనను కూడా చదివిలే చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా సీఎం ను కలిసిన వారిలో సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు, ఏపీ ప్రింటర్లు, పబ్లిషర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ మోహన్ ,తదితరులు ఉన్నారు.






