రేప‌టి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు

అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 9వ తేదీ దాకా

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షోలు పార్టీ ప‌రంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఆయ‌న వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు ఈ రోడ్ షోలు చేప‌ట్ట‌నున్నారు. ఇక వివ‌రాల లోకి వెళితే అక్టోబ‌ర్ 31న షేక్ పేట్, న‌వంబ‌ర్ 1న రెహ‌మత్ న‌గ‌ర్, 2న యూసుఫ్ గూడ‌, 3న బోర‌బండ‌, 4న సోమాజిగూడ‌, 5న వెంగ‌ళరావు న‌గ‌ర్, 6న ఎర్రగడ్డ డివిజన్ లో రోడ్ షో చేప‌డ‌తారు. అదే విధంగా న‌వంబ‌ర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ లలో , 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో ముగుస్తుంద‌ని పార్టీ పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం అంద‌రి చూపు 4 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు క‌లిగిన జూబ్లీ హిల్స్ లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇక్క‌డ ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్య‌ర్థులు ఉన్న‌ప్ప‌టికీ న‌వీన్ యాద‌వ్ వ‌ర్సెస్ మాగంటి సునీత మ‌ధ్యే నెల‌కొంది వార్. మొత్తం 81 నామినేష‌న్లు వేశారు. 100 మందిని పోలీసులు బైండోవ‌ర్ చేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న న‌వీన్ యాద‌వ్ తండ్రి చిన్న శ్రీ‌శైలం యాద‌వ్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజ‌క‌వర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా దొంగ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని బీఆర్ఎస్ ఇప్ప‌టికే ఈసీకి ఫిర్యాదు చేసింది.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *