2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు
బెంగళూరు : రాకింగ్ స్టార్ యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. బెంగళూరులో మూవీ చిత్రీకరణ ఆఖరు దశలో ఉంది. ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. గీతూ మోహన్ దాస్ టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఈ మధ్యన పెద్ద ఎత్తున సినిమాను అనుకున్న తేదీ రోజు విడుదల చేయరంటూ ప్రచారం జరిగింది. ఈ అనుమానలను పక్కన పెడుతూ కీలక అప్ డేట్ ఇచ్చేశారు ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్ష్. ఈ మేరకు ఇప్పటికే ప్రకటించిన విధంగానే వచ్చే ఏడాది 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన విడుదల చేస్తారని తెలిపారు. ఇక టాక్సిక్ బృందం ఈ చిత్రం షెడ్యూల్ లోనే ఉందని, ఏప్రిల్‌లో పోస్ట్-ప్రొడక్షన్, VFX పనులు ప్రారంభమయ్యాయని స్పష్టం చేసింది.
యశ్ ముంబైలో రామాయణం షూటింగ్ ప్రారంభించిన సమయానికి సమాంతరంగా. ప్రస్తుతం బెంగళూరులో చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. పూర్తి స్థాయి ప్రమోషన్లు జనవరి 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా. KGF తర్వాత యశ్ పెద్ద తెరపైకి తిరిగి రావడంతో, టాక్సిక్ చుట్టూ ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఇంగ్లీష్ , కన్నడ భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు దర్శకురాలు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, మరిన్నింటిలో కూడా విడుదల అవుతుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ , యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు టాక్సిక్.








