బొమ్మ‌ల‌మ్మ గుట్ట‌ను ర‌క్షించాలి : క‌విత

గ్రానైట్ మాఫియాపై చ‌ర్య‌లు తీసుకోవ‌లి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌నంబాట కార్య‌క్ర‌మం చేప‌ట్టారు .ఈ సంద‌ర్బంగా ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మ గుట్టను సంద‌ర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్ను ప‌డింద‌న్నారు క‌విత‌. తమ సొంత ఖజానా నింపుకోవడానికి చారిత్రాక గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భవిష్యత్ తరాల కోసం బొమ్మలమ్మ గుట్టను రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు జాగృతి అధ్య‌క్షురాలు.

ఇదిలా ఉండ‌గా బొమ్మలమ్మ గుట్టను కాపాడు కోవ‌డం కోసం చేసే ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అనంత‌రం ఆమె వంగ‌ర గ్రామానికి చెందిన బీసీ బిడ్డ శ్రీ‌హ‌ర్షిత బీసీ హాస్టల్ లో సూసైడ్ చేసుకుంది. తెలిసిన వెంట‌నే మృతురాలి ఇంటికి వెళ్లారు. అక్క‌డ క‌న్నీటి ప‌ర్యంతం అయిన శ్రీ‌హ‌ర్షిత త‌ల్లిని ప‌రామ‌ర్శించారు. ఆత్మ‌హ‌త్య చేసుకునే గంట ముందు పేరెంట్స్ తో మాట్లాడింద‌ని, ఆ త‌ర్వాత ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం త‌నను క‌లిచి వేసింద‌న్నారు క‌విత‌. వెంట‌నే మృతురాలి కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం ప్ర‌భుత్వం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ గురుకులాల‌లో విద్యార్థినులు సూసైడ్ చేసుకుంటున్నార‌ని ఆవేద‌న చెందారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *