తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

జ‌ర్మ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ తో భేటీ అయిన రేవంత్

హైద‌రాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. GCC ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని వారిని కోరారు ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *