శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో లోకేష్

అయ్య‌ప్ప భ‌క్తుల పూజ‌లో పాల్గొన్న మంత్రి

అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా అయ్య‌ప్ప భ‌క్తులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. పెద్ద ఎత్తున అయ్య‌ప్ప స్వామి మాల‌లు ధ‌రించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంత‌రం అయ్య‌ప్ప స్వామి మాలాధార‌ణ చేప‌ట్టిన భ‌క్తుల‌కు పెద్ద ఎత్తున మ‌హా ప్ర‌సాదం పంపిణీ చేశారు. స్వ‌యంగా పాల్గొన్నారు మంత్రి. వారికి పండ్లు, ఫ‌ల‌హారాలు, ఇత‌ర ప్ర‌సాదాల‌ను అందించారు. అయ్య‌ప్ప స్వామి క‌రుణ క‌టాక్షం అయ్య‌ప్ప స్వాముల‌కు క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు లోకేష్. త‌మ ప్ర‌భుత్వం ఆల‌యాల అభివృద్దికి కృషి చేస్తోంద‌ని చెప్పారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *