ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకు రావాలని అన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగు పరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అన్నారు. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలని అన్నారు. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. తద్వారా ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో పనుల పరోగతిని పరిశీలించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఏ పని చేసినా ప్రజలకు జవాబు దారీతనంగా ఉండాలి అన్నదే మా ఉద్దేశం అన్నారు.






