కారుకు ఓటేయండి కాంగ్రెస్ కు బుద్ది చెప్పండి

పిలుపునిచ్చిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

రంగారెడ్డి జిల్లా : అడ్డ‌గోలు హామీల‌తో నాలున్న‌ర కోట్ల ప్ర‌జానీకం చెవుల్లో పూలు పెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప‌టాన్ చెరు లో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం త‌ప్పితే ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్టారా అని ప్ర‌శ్నించారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోతామా , కలలో కూడా కలగనని ఇళ్లలో ఉంటామని అనుకోలేదన్నారు. మీ ఓట్లు ఖాయంగా కేసీఆర్‌కే అని అర్థ అయ్యిందన్నారు. మీ బంధువులకు కూడా చెప్పి కారుకు ఓటేయమ్మని చెప్పాల‌ని కోరారు హ‌రీష్ రావు. ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేద‌న్నారు.

మంత్రులు జూపల్లి కృష్ణారావుకు, పొన్నం ప్రభాకర్‌కు జూబ్లీహిల్స్ ఓటర్లు చుక్కలు చూపించారని అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు. ఓటుకు రూ.3వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. తీసుకుని మిగతా రెండేళ్లలో ఇస్తామన్న డబ్బులు కూడా అడగాల‌ని సూచించారు హ‌రీశ్ రావు. రూ. 2,500 లేదు, మహాలక్ష్మి స్కీమ్ లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. తులం బంగారం అడిగితే ఓ మంత్రి లక్ష దాటింది ఎక్కడ ఇస్తాం అని మాట్లాడుతున్నాడని, మరి అలాంటప్పుడు హామీ ఎందుకు ఇచ్చారంటూ నిల‌దీశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే ఆయన అంధుడు అయినా ఉండాలి లేదా పిచ్చోడైనా ఉండాల‌న్నారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *