తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలి
ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ , స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి సంచలనంగా మారారు. ఇప్పటికే కోర్టు ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువరించింది. అంతే కాకుండా షమీ ప్రతి నెలా తనకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. అయితే మరోసారి రచ్చకు ఎక్కింది మాజీ భార్య. తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలని కోరింది. ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా దాఖలు చేసిన పిటిషన్ పై భారత క్రికెటర్ షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందన కోరింది.
విచారణ సందర్బంగా మధ్యంతర ప్రాతిపదికన భరణం కోసం, షమీస్ భార్య, కుమార్తెకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన అవార్డు న్యాయబద్దంగానే ఉందని పేర్కొంది. ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఇదిలా ఉండగా మహ్మద్ షమీ తన విడిపోయిన భార్య హసిన్ జహాన్ , కుమార్తెకు నెలవారీ భరణం రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. జహాన్‌కు నెలకు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కుమార్తెకు నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కలకత్తా హైకోర్టు భరణంపై ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేసింది . గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 20 ప్రకారం, ద్రవ్య ఉపశమనం తగినంతగా, న్యాయంగా, సహేతుకంగా , వైవాహిక జీవనశైలికి అనుగుణంగా ఉండాలని తను పిటిషన్ లో కోరింది.








