కోటి దీపోత్స‌వం అద్భుతం : సీఎం

ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలొ నిర్వ‌హిస్తాం

హైద‌రాబాద్ : కోటి దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొని పూజ‌లు చేశారు. మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకంగా గుర్తుండి పోతుంద‌న్నారు రేవంత్ రెడ్డి. గ‌త 14 సంవత్సరాలుగా రచన టెలివిజన్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నార‌ని, వారికి అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. హైదరాబాద్ లో ప్రారంభమై దేశ సరిహద్దులు దాటి భక్త కోటికి హర హర మహాదేవ నామాన్ని వినిపిస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారిని అభినందిస్తున్నాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

ఆధ్యాత్మికత మనందరికీ ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నా జన్మదినం కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీ మధ్య గడపడం మ‌రిచి పోలేన‌ని అన్నారు సీఎం. ఆశీర్వదించిన భక్తకోటికి నా అభినందనలు, శుభా కాంక్షలు తెలియ చేస్తున్నాన‌ని చెప్పారు. భక్తి టీవీ దేశంలోనే అత్యధిక భక్తులు వీక్షించే ఛానల్ గా మన్ననలు పొందుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తామ‌న్నారు.

  • Related Posts

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    స‌త్య‌సాయి బాబా జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : ఈ భూమి మీద పుట్టిన అద్భుత‌మైన వ్య‌క్తి భ‌గ‌వాన్ శ్రీ స‌త్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *