చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు

చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే సంద‌డి మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన మేనేజ్మెంట్ ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ. దీంతో ఆయా జట్లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఎవ‌రిని చేర్చుకోవాలి, ఇంకెవ‌రిని వ‌దులు కోవాల‌నేది. గ‌తంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు రిష‌బ్ పంత్. కానీ ఊహించ‌ని రీతిలో ఆడ‌లేక పోయాడు. కానీ ఇప్పుడు టోర్నీ మాటేమిటో కానీ యంగ్ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌ను వికెట్ కీప‌ర్ , బ్యాట‌ర్, అద్భుత‌మైన కెప్టెన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

గ‌త 12 ఏళ్లుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌ను కెప్టెన్ గా ఆ జ‌ట్టును ఫైన‌ల్ దాకా చేర్చాడు. ఇందులో త‌ను కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు త‌న‌ను చేజిక్కించు కునేందుకు ప‌లు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌ధానంగా రేసులో ఉన్నాయి. తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం సంజూ శాంస‌న్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ తీసుకునేందుకు ఆస‌క్తి చూపించింది. త‌మ జ‌ట్టులో కీ రోల్ పోషిస్తున్న ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను వ‌దులు కునేందుకు ఆ జ‌ట్టు ఉత్సుక‌త చూపించిన‌ట్లు టాక్. అయితే మ‌రో ప్లేయ‌ర్ ను కూడా ఇవ్వాల‌ని రాజస్థాన్ ప‌ట్టు ప‌డుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *