ధన్యవాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్రదర్శన
హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ సందర్బంగా స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ప్రదర్శనలు నిర్వహించారు.
రోడ్డులు, పార్కుల ఆక్రమణలను తొలగించిందుకు ధన్యవాదాలు తెలిపారు. అల్మాస్ గూడ బోయపల్లి ఎన్ క్లెవ్ కాలనీలో లేఔట్ ప్రకారం ఉన్న రోడ్లు, పార్కులను హైడ్రా కాపాడిందంటూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా హైడ్రాకు, సర్కార్ కు కృతజతలు తెలియ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని అభినందించారు. పూర్తి స్థాయి లో కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, కాలనీ పార్క్ ను అభివృద్ధి చేయాలని, రోడ్లు బాగు చేయాలని కోరారు. హుస్సేనీ ఆలయంలో ఫాతిమా కాలనీలో కూడా హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు.






