తైవాన్ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందం
విశాఖపట్పం జిల్లా : ఏపీ సర్కార్ ప్రముఖ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ తైవానీస్ కంపెనీలతో రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని మరింత బలోపేతం చేయడంలో కీలకమైన అడుగు వేసిందని చెప్పక తప్పదు. అల్లెజియన్స్ గ్రూప్ రూ. 400 కోట్ల పెట్టుబడితో కుప్పంలో 470 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ ఒక్క పార్కు ద్వారా దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 50,000 మందికి పైగా జాబ్స్ వస్తాయని తెలిపారు.
eJoule Inc. (USA), Creative Sensor Inc. (తైవాన్), C(ఇండియా) ల భాగస్వామ్యంతో eJoule India JV, ₹18,000 కోట్ల పెట్టుబడితో కర్నూలులోని ఓర్వకల్ వద్ద భారతదేశంలో మొట్టమొదటి 23 GWh ప్రీకర్సర్-ఫ్రీ సింగిల్-క్రిస్టల్ కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ . సాలిడ్-స్టేట్ ఎలక్ట్రోలైట్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు నారా చంద్రాబు నాయుడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 2,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందాలు స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047 కింద అధునాతన తయారీ, స్థిరమైన వృద్ధికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయని అన్నారు. వికసిత్ భారత్ వైపు భారతదేశం ప్రయాణంలో రాష్ట్రాన్ని కీలక చోదకంగా మారుస్తాయనడంలో సందేహం లేదన్నారు సీఎం.








