రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడుతున్నా : సంజూ శాంస‌న్

జ‌ట్టు విజ‌యం కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశా

కేర‌ళ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ గురువారం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో తాను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును వీడాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నాడు. ఆ జ‌ట్టుకు నా సార‌థ్యంలో ఐపీఎల్ క‌ప్ ను అందించాల‌ని క‌ల క‌న్నాన‌ని కానీ అది తీర‌కుండానే వెళ్లాల్సి వ‌స్తోంద‌ని వాపోయాడు. తాను కావాల‌ని వెళ్లాల‌ని అనుకోలేద‌ని, కానీ ప‌రిస్థితులు త‌న‌ను ఆడ‌నీయ‌కుండా చేశాయ‌న్నాడు సంజూ శాంస‌న్. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బ‌లోపేతం కోసం నా శాయ శ‌క్తులా కృషి చేశాన‌ని తెలిపాడు. ఈ సంద‌ర్బంగా తను టీం కోసం ఎలాంటి క‌ల క‌న్నాడో కూడా పంచుకున్నాడు. టోర్నీలో భాగంగా ఆర్ఆర్ క‌ష్టాలో ఉన్న‌ప్పుడు నిరాశ ప‌రిచేలా జ‌ట్టు ఆడింది.

ఆరోజు అర్ధ‌రాత్రి తాను ఫిట్ నెస్ కోచ్ తో మాట్లాడాను. పెద్ద క్ల‌బ్ టీమ్ కు వెళ్లే బ‌దులు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టీమ్ ను బ‌ల‌మైన జ‌ట్టుగా మారుస్తాన‌ని త‌న‌కు తానుగా వాగ్ధానం చేసుకున్నాన‌ని తెలిపాడు. మెగా వేలానికి 2 సంవత్సరాల ముందు చాహల్ , అశ్విన్ వంటి ఆటగాళ్లను తీసుకు రావాలని కోరుకున్న‌ట్లు చెప్పాడు. చివ‌ర‌కు జ‌ట్టును ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకు వెళ్లాన‌ని తెలిపాడు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ టోర్నీలో త‌న‌ను సంప్ర‌దించ‌కుండానే చాహ‌ల్, బ‌ట్ల‌ర్ ను వ‌దులుకుంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. చివ‌ర‌కు ఆ జ‌ట్టు నుంచి వీడేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు. చివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ క్ల‌బ్ లో జాయిన్ కానున్నాడు సంజూ శాంస‌న్.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *