ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ స్పీడులో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రూ. 82,000 కోట్ల ఒప్పందం చేసుకోవడం జరిగిందని ప్రకటించారు నారా లోకేష్.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ వేదికగా 30వ సీఐఐ ఏపీ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్, పెట్టుబడిదారులు, చీఫ్ కన్సల్టెంట్స్ , ప్రముఖులు హాజరవుతున్నారు. రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆశా భావం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.








