రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆగ‌మాగం : దాసోజు

సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని వాపోయారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పీక‌ర్ , సీఎం పూర్తిగా అప్ర‌జాస్వ‌మికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తాను లేఖ కూడా రాశాన‌ని చెప్పారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి 76 వేల కోట్ల రూపాయలు మాత్రమే రియలైజ్ అయ్యాయని తెలిపారు.

లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని చెప్పారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని అన్నారు. జీఎస్టీ వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని మండిప‌డ్డారు సీఎంపై. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యింద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే కేవ‌లం 32 శాతం మేరకే స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చిందన్నారు. ఎక్సయిజ్ ఆదాయం కూడా 35 శాతం లోపే వచ్చింద‌న్నారు. అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని మండిప‌డ్డారు. రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల అప్పు చేశారని ధ్వ‌జ‌మెత్తారు.
ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారంటూ ఫైర్ అయ్యారు.
కాగ్ డాటా రేవంత్ బట్టలు విప్పేసింద‌న్నారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *