భారీ ఎత్తున ఆదరిస్తున్న అభిమానులు
హైదరాబాద్ : సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జాహ్నవి కపూర్ కీ రోల్స్ పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ పాటకు స్వరాలు కూర్చారు. అద్భుతమైన ట్యూన్ దీని స్వంతం. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ విడుదలై నాటి నుంచి నేటి దాకా మిలియన్స్ వ్యూస్ స్వంతం చేసుకుంది. అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. ఒక రకంగా అల్లా రఖా రెహమాన్ మ్యాజిక్ చేసేశాడు. చిక్రి చిక్రి, రంగుల విజృంభణలా వచ్చింది .ఉత్సాహ భరితమైన, లయ బద్ధమైన పాటగా దీనిని మలిచాడు మ్యూజిక్ డైరెక్టర్.
భారతదేశ సంగీత ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తున్న ఎ.ఆర్. రెహమాన్ మోహిత్ చౌహాన్ తో పాటించాడు. ఈ పాట తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ , తదితర భాషలలో దీనిని రూపొందించాడు. ఇక బుచ్చిబాబు సనకు రామ్ చరణ్ తో తీస్తున్న మూవీ తన కెరీర్ పరంగా ఇది రెండో మూవీ. తను గతంలో ఉప్పెన పేరుతో సినిమా తీశాడు. ఇందులో కొత్త హీరోయిన్ గా కృతీ శెట్టిని తీసుకు వచ్చాడు. ఇక మోహిత్ చౌహాన్ అద్భుతంగా పాడాడు చిక్రి చిక్రి పాటను. ఇది గతంలో ఇప్పటి వరకు చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ ల పాటలను తోసిరాజని టాప్ లో నిలిచింది. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సంగీత కచేరి నిర్వహించాడు ఏఆర్ రెహమాన్.








