ఏర్పాట్లపై సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : పెట్టుబడులను సాధించడంలో ఓ వైపు ఏపీ సర్కార్ టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ కూడా సిద్దమైంది సమ్మిట్ ను నిర్వహించేందుకు . ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్బంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ లో నిర్వహించబోయే Telanaga Rising Global Summit- 2025 పై పూర్తిగా దృష్టి సారించాలని ఆదేశించారు. డిసెంబర్ 9 న Telanga Rising-2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఇది తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ కానుందన్నారు. ఈ డాక్యూమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని స్పష్టం చేశారు. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్ లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం. ఈ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్ల పై సమీక్షలో చర్చించారు.






