షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రే
ముంబై : బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్ విజయం సాధించేలా సపోర్ట్ చేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వారి యజమానులైన బిజెపికి 65 లక్షల మంది ఓటర్లను కోసే SIR ప్రయోగం విజయవంతమైందని అన్నారు. బిజెపి ఆట కారణంగా నితీష్ కుమార్ నిజంగా ముఖ్యమంత్రి అవుతాడా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
బిజెపిని దగ్గరగా చూసినందున ఆయన అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నానని అన్నారు. మహిళల కోసం పథకాలు వారి ఓట్లను ప్రభావితం చేస్తాయని నేను నమ్మను అని చెప్పారు ఆదిత్యా ఠాక్రే. మహిళలు ఎప్పుడూ ఎవరికి ఓటు వేస్తారనే దాని గురించి ఆలోచిస్తారు. వాస్తవానికి బీహార్ లో వారు ఓటు వేయలేదు, ‘నోట్లు’ వైపు చూస్తూనే ఉన్నారని అన్నారు. వారు (ఎన్డీఏ) ఓటు-చోరి ద్వారా తమ విజయాన్ని సమర్థించు కోవడానికి ‘లాడ్లీ బెహ్నా’ పథకం సాకును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మ్యాజిక్ ఎన్నికల సంఘం వల్ల జరిగిందని మండిపడ్డారు. భారత ఎన్నికల సంఘం కాదని బీజేపీ ఎన్నికల సంఘం అని పేర్కొన్నారు.






