దాడుల‌కు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్

కాంగ్రెస్ స‌ర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని, ఆ విష‌యం సీఎం తెలుసుకుంటే మంచిద‌న్నారు. రౌడీయిజం చేయ‌డం, దొంగ ఓట్లు వేయించ‌డం, కోట్లాది రూపాయ‌లు పంచి పెట్ట‌డం వ‌ల్ల‌నే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గెలిచాడ‌ని ఆరోపించారు. ఈ విజ‌యం పార్టీది కాద‌న్నారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు కేటీఆర్.

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఏనాడూ ఇలా దాడుల‌కు పాల్ప‌డ లేద‌న్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఎల్ల‌కాలం ఇది చెల్లుబాటు కాద‌ని అన్నారు. తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. త‌మ‌ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చ‌శారు. తాను అహంకారం తగ్గించు కోవాలన్న రేవంత్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇక‌నైనా గూండాగిరీకి చెక్ పెట్టాల‌ని లేక పోతే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *