రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి జడేజా, శామ్ కరన్
చెన్నై : ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అంశం. ఏ జట్టులోకి తను వెళతాడనేది క్రికెట్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు తనను తీసుకుంది. శాంసన్ ను తీసుకునేందుకు కీలకమైన ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్ లను వదులుకుంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. అయితే శాంసన్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు ఐపీఎల్ లో . రాజస్థాన్ రాయల్స్ జట్టును ఏకతాటిపై నడిపించాడు. ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకు వచ్చాడు. ఇందులో తన పాత్ర ఉంది. ఇది కాదనలేని సత్యం. ఇదే సమయంలో ఈసారి జరిగిన ఐపీఎల్ లో తనకు తెలియకుండానే మేనేజ్మమెంట్ యుజేంద్ర చాహల్ తో పాటు జాస్ బట్లర్ ను జట్టు నుంచి రిలీజ్ చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్ వేలం పాటలో సంజూ శాంసన్ వాల్యూ ధర రూ. 18 కోట్లుగా ఉంది. తనను తీసుకునేందుకు గాను రూ. 14 కోట్లు విలువ చేసే రవీంద్ర జడేజాతో పాటు రూ. 2.4 కోట్లు విలువ చేసే శామ్ కరన్ ను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇదిలా ఉండగా సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరపున 11 సార్లు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించాడు . 2013లో చేరిన అతను త్వరగా కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2014 సీజన్‌కు ముందు కేవలం 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. అతను 2018లో తిరిగి వచ్చి 2021లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. జట్టు డైరెక్టర్ కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో 2022లో రాజస్థాన్ జట్టును ఫైనల్ దాకా తీసుకు వెళ్లడంలో ముఖ్య భూమిక పోషించాడు.








