స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సీజేఐ ఆగ్రహం
ఢిల్లీ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. సోమవారం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విధించిన గడువు పూర్తయినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. తను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకుంటావా లేక జైలులో చేసుకుంటావా తేల్చుకోవాలని స్పష్టం చేసింది స్పీకర్ కు. ఒక రకంగా ఇవాళ చేసిన సీజేఐ చేసిన కామెంట్స్ చెంప పెట్టు అని చెప్పదు. ఒక పార్టీపై గెలిచి అధికారం కోసం ఇతర పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కనీసం విలువలు లేక పోవడం పట్ల కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది.
కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తాము భావించాల్సి వస్తుందని, తను జైలు శిక్ష అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు స్పీకర్ తరపున దాఖలు చేసిన దావాపై కూడా సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే స్పీకర్ కోర్టు ధిక్కరణ చేసినట్లే అని హెచ్చరించారు. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాం. ఫిరాయింపులను దాచిపెట్టి వ్యవస్థను ఎద్దేవా చేసే అవకాశం ఎవరికి లేదని కుండ బద్దలు కొట్టారు సీజేఐ.






