ప్రకటించిన ఛానలె సిఈఓ వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో నిర్వహించే తెలంగాణ టెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి శాట్ ఛానల్ కంటెంట్ ను సిద్దం చేసిందని చెప్పారు సీఈఓ వేణుగోపాల్ రెడ్డి. టి-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు, విద్య ఛానల్లో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రతిరోజూ నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని సీఈవో ప్రకటించారు. టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్ కు అవసరమైన సబ్జెక్టులు చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ, ఫిజికల్, బయాలాజికల్ సైన్స్, మాథ్స్, సోషల్ స్టడీస్ తో పాటు ఇంగ్లీష్, తెలుగు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ లెసన్స్ ప్రసారం అవుతాయని అన్నారు.
టెట్ పేపర్-1, 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ అందించే ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఈవో వేణుగోపాల్ రెడ్డి కోరారు. టెట్ అర్హత పరీక్ష కోసం ప్రసారం చేసే ప్రత్యేక కంటెంట్ టి-సాట్ శాటిలైట్ ఛానళ్లతో పాటు, టి-సాట్ యాప్, యూట్యూట్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్బంగా సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు టి శాట్ టెట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాధిక్ కూడా పాల్గొన్నారు.






