జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. అంతే కాకుండా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించారు. అక్క‌డే ఉంటూ చ‌దువుకుంటున్న పేద విద్యార్థినుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. చ‌దువు కోవాల‌ని, విద్య ఒక్క‌టే మ‌న‌కు గౌర‌వాన్ని తీసుకు వ‌స్తుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కుప్పం నియోజకవర్గంలో.ఇ తుమ్మిసి పెద్ద చెరువులో జలహారతి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు నారా భువ‌నేశ్వ‌రి. కుప్పంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. వ్య‌వ‌సాయం కీల‌క‌మైన రంగ‌మ‌ని, రైతులు బాగుంటేనే మ‌నం బాగుంటామ‌ని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా కూట‌మి స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి.

  • Related Posts

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *