సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఆనంద్ బోస్
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సంరక్షకుడిని మాత్రమేనని, అయితే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఆదివారం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బెల్దంగాలో సస్పెండ్ చేయబడిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేసిన బాబ్రీ మసీదు శంకుస్థాపనపై గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. శాంతి భద్రతలను కాపాడాలని నేను కఠినమైన సూచనలు ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగిందన్నారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని స్పష్టం చేశారు గవర్నర్. ఈరోజు శాంతియుతంగా ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ అనుమతించ బడరని వార్నింగ్ ఇచ్చారు. మనకు కావలసింది సమాజంలో శాంతియుతంగా ఉండడం. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా నిర్వహించి నందుకు బెంగాల్ ప్రజలను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆర్డర్‌ను నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా పేర్కొందన్నారు.






