ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గజం లియోనెల్ మెస్సీ తెలంగాణలో కాలు మోపనున్నాడు. ఈ సందర్బంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతాడు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది . ఈ కీలక మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు.
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం భద్రత, లాజిస్టిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. మరోవైపు సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను రేపటి నుంచి నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9వ తేదీలలో జరగనున్న ఈ సమ్మట్ అనంతరం మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు రేవంత్ రెడ్డి. ఫుల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు తను.







