నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా లక్ష్మా పూర్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లోని లక్ష్మాపూర్ గ్రామ రైతులు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వందేళ్లుగా లక్ష్మాపూర్ నక్ష సరిగా లేక పోవటంతో దీన్ని సరిచేస్తామని గతంలో ఇక్కడ ఆగి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా ధరణి ద్వారా ఈ గ్రామానికి నక్ష చేయటం జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితి మార్చేందుకే ధరణి తెస్తున్నామని అసెంబ్లీలో కూడా చెప్పారన్నారు.
శాటిలైట్ సర్వేలో కూడా చాలా ఇబ్బందులు, అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. దీంతో రైతులకు ఎప్పుడు కూడా సంపూర్ణంగా రైతుబంధు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. అదే విధంగా ఐదు ఎకరాలకు రైతుకు ఎకరం, రెండు ఎకరాల రైతుకు అర్థ ఎకరం ఉన్నట్లు పడ్డాయన్నారు కవిత. పట్టా భూములను సైతం లవణి భూములుగా రికార్డుల్లో రాశారని ఆరోపించారు. కేసీఆర్ తప్పు చేశారు కాబట్టి మేము సరిచేస్తామని ఇప్పటి ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. లక్ష్మాపూర్ కు వచ్చి ఇక్కడ ఉండి వారికి హామీ ఇచ్చిన విషయం మరిచి పోయారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత.






