రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : మిర్చి పంట‌కు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న ఉద్యాన‌వ‌న శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కె. శ్రీ‌నివాసులుతో క‌లిసి టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్రస్థాయిలో తెగుళ్ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , ఎల్ల‌ప్పుడూ వ్య‌వ‌సాయ , ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు అందుబాటులో ఉండాల‌ని, వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఇందుకు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు.

  1. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. 2. ఎకరాకి 200 కేజీల వేప చెక్కను చివరి దుక్కులో వేసుకోవాలి. 3. సిఫారుసు చేసిన మోతదులోనే ఎరువులు వేసుకోవాలి. 4. పంట మార్పిడి చేయాలి. 5. పచ్చిరోట్ట పైరును వేసుకోవాలి. 6. రైతులు సామూహికంగా ఎకరానికి 40 నుంచి 50 నీలి రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. 7. వేప సంబందిత పురుగు మందులైన వేప నూనే (10,000 పి.పి.యం.- 1 మి.లీ లీటరు నీటికి లేదా 1500 పి.పి.యం లేదా 3000 పి.పి.యం 2 మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  2. సిఫారుసు చేసిన పురుగు మందులైన బ్రోప్లనిలైడ్ 20 ఎస్.సి. 34 మి.లీ., లేదా ప్లుక్సామెటామైడ్ 20 ఈ.సి. 160 మి.లీ., లేదా ఫిప్రానిల్ 80% డబ్య్లు .జి. 40 గ్రా., లేదా స్పైరో టెట్రామాట 15.30% ఓ.డి. 200 మి.లీ. చొప్పున 1 ఎకరానికి పిచికారి చేయాలి. వాడిన పురుగు మందునే మరల వాడకుండా మార్చి మార్చి పిచికారి చేయాలి. విచక్షణా రహితంగా తక్కువ వ్యవధిలో సిఫారుసు చేయని పురుగు మందులను వాడరాదని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
  • Related Posts

    బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

    Spread the love

    Spread the loveత‌న సార‌థ్యంలో పార్టీ మ‌రింత బ‌లోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ న‌బిన్ కు ఊహించ‌ని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను భార‌తీయ…

    ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveకేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *