రాబోయే రోజుల్లో గెలుస్తామన్న పార్టీ చీఫ్
తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది ఒక చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. ఎందుకంటే మేము ఓట్ల వాటా తో పాటు రాజకీయ అడుగు జాడల్లో గణనీయమైన పురోగతి సాధించామని స్పష్టం చేశారు. బిజెపి , ఎన్డిఎ ఎల్డిఎఫ్ , యుడిఎఫ్ ప్రాంతాలలో కూడా తమ పార్టీ అభ్యర్థులు భారీ ఎత్తున విజయం సాధించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించేలా చేసిందన్నారు రాజీవ్ చంద్రశేఖర్. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం పార్టీకి చీఫ్ గా కొనసాగుతున్నారు.
తన ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడం పట్ల సంతోషంగా ఉన్నారు. ఇది ఎల్డిఎఫ్ చిత్రం నుండి బయట పడిందని నిరూపించిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎంపిక యుడిఎఫ్, ఎన్డీయే మధ్య ఉంటుందన్నది వాస్తవం అన్నారు. ఎల్డిఎఫ్ వారి అవినీతి దుర్వినియోగం కోసం మేము ఎల్లప్పుడూ దాడి చేస్తూనే ఉంటామని చెప్పారు రాజీవ్ చంద్రశేఖర్. అయితే కాంగ్రెస్ 27 రాష్ట్రాలు , 8 కేంద్రపాలిత ప్రాంతాలలో సిపిఐ (ఎం) తో పొత్తులో ఉంది, కాబట్టి అది ప్రజలను తప్పుదారి పట్టించ కూడదన్నారు. కాంగ్రెస్, వామపక్షాల వంటి అవినీతి కవలల నుండి మాకు ఎటువంటి ఆమోదం అవసరం లేదన్నారు.






