ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఓ విజ‌న్ ఉంద‌ని, దానిని సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాంక్లేవ్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అని ప్ర‌శంసించారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు, దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌టించారు. 20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ప్ర‌శంస‌లు కురిపించారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా మారింద‌ని చెప్పారు సీఎం. 2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుందని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకుంటూ వ‌చ్చామ‌ని చెప్పారు. ఈ ఏడాదితో పాటు గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామ‌ని అన్నారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *