
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ : తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ నూతన భారత దేశ ఉప రాష్ట్రపతిగా శుక్రవారం కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో తనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరగడం విస్తు పోయేలా చేసింది. ఎన్నికలో మొత్తం 781 ఓట్లకు గాను సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు పోల్ కాగా ప్రధాన ప్రత్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఒకరకంగా ఆయన పోటీ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రకంగా చర్చ జరిగేలా చేయడంలో జస్టిస్ కీలకంగా మారారు.
ఇక సీపీ రాధాకృష్ణన్ జీవితం ముందు నుంచీ ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. తన స్వస్థలం తమిళనాడు. ఆయన మే 4, 1957లో తిరుప్పూర్ లో పుట్టారు. 1998లో కోయంబత్తూర్ నుండి తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరిగి ఎంపీగా గెలుపొందారు. మహారాష్ట్రకు ఆయన 24వ గవర్నర్ గా పని చేశారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో గుజరాత్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్. ఆయన ఇటీవలే తాను ఆరోగ్యంగా లేనని అందుకే తప్పుకుంటున్నట్లు రాజీనామా చేయడం కలకలం రేపింది.