
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ఉంటుందని కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయిందన్నారు షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొణిదల , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక విషయంలో అన్ని పార్టీలు గంపగుత్తగా మద్దతు ఇచ్చాయని ఏపీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ ముగ్గురు మోదీకి, అమిత్ షాకు లొంగి పోయారని, అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు కళ్లు మూసుకుని ఓటు వేశారని వీరిని ఎన్నుకుని సిగ్గు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయకుండా మనసు చంపుకుని పరువు తీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. వీళ్ల వల్ల ఏపీకి ఒనగూరింది ఏమీ లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు ఒక విలువ ఉందని, ఉన్న ఎంపీలు హాజరు కావడమే మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.