హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

రిజ‌ర్వేష‌న్ల‌పై కీలక వాదోప వాద‌న‌లు

హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు అంశంపై బుధ‌వారం హైకోర్టులో తీవ్ర వాదోప‌వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ట్రిపుల్‌టెస్ట్‌ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ సంద‌ర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు వ‌చ్చారు. ట్రిపుల్‌ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం ఆదేశించింద‌ని తెలిపారు. ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు లాయర్‌ బుచ్చిబాబు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు చేయల‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన పిటిషనర్‌ లాయర్ . రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఆదేశించింద‌న్నారు. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ఇంకా ఇవ్వలేదన్నారు లాయర్లు . కేవలం షెడ్యూల్‌ మాత్రమే విడుదల చేశారని వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. 4 అంశాల ఆధారంగా జీవో 9 ఛాలెంజ్‌ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

వన్‌మ్యాన్‌ కమిషన్‌ నివేదిక బయట ఎట్ట లేద‌న్నారు న్యాయ‌వాది వివేక్ రెడ్డి. అయితే ట్రిపుల్‌ టెస్టు లేకుండానే రిజర్వేషన్లు 50 శాతం మించొద్్ద‌ని అంటున్నారు స‌రే మ‌రి అసెంబ్లీలో రిజర్వేషన్‌ బిల్లు ఎప్పుడు పాసైందని అడిగారు న్యాయ‌మూర్తి. ఆగస్ట్‌ 31 రెండు సభల్లో పాసైందన్న లాయర్‌. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందా అని అడిగారు. జీవో 9తో పాటు జీవో నెంబర్‌ 41 కూడా చెల్లదని లాయర్ వాద‌న‌లు వినిపించారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద బిల్లు ఇంకా పెండింగ్ లో ఉంద‌న్నారు. అది ఇంకా చ‌ట్టంగా మార‌లేద‌న్నారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *