టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్
అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు.
.రాజ్యంగం ప్రకారం ఎన్నికైన కూటమి ప్రభుత్వాన్ని జగన్ అస్థిరప రచాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినా ఆయన ఆటలు సాగవన్నారు. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి ఊత సాయంతో ఎలా బయట పడాలని చూస్తాడో.. జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉందని ఎద్దేవా చేశారు. దళిత వర్గాలపై జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రేమ లేదన్నారు. దళిత వర్గాలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓసారి సక్సెస్ అయ్యి మరోసారి బొక్కబోర్ల పడ్డరాని అన్నారు. డా.బి. ఆర్ అంబేద్కర్ పై జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రేమ లేదన్నారు.
అంబేద్కర్ పై అంత ప్రేమ ఉంటే రూ.400 కోట్లు ఖర్చు చేసి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. తాడెపల్లిలో ఇంట్లో ఉండి వైఎస్ జగన్ విగ్రహం ఓపెనింగ్ చేసినట్లు ఆరోపించారు. అంత ప్రాజెక్టు చేసి ఇంట్లో ఉండి ఓపెనింగ్ చేస్తారా..? అంబేద్కర్ పై ప్రేమ ఉందని చెప్పుకున్న వైసీపీ పోలీసు స్టేషన్ లో దళితులకు శిరోమండనం చేస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. కిరణ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు తరిమి తరిమి చంపితే ఏం మాట్లాడలేదన్నారు. మీ స్వంత నియోజక వర్గంలో దలిత మహిళ నాగమ్మపై దాడి జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు దళితడైన ప్రతాప్ లిక్కర్ తాగి ప్రభుత్వాన్ని ద్వేషించాడని చంపేశారు. ఆయన ఫోన్ కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదన్నారు. కొవ్వురులో దళితుడ్ని చంపారు. మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిపై బేడీలు వేచి ఊరు మొత్తం తిప్పారని మండిపడ్డారు. చిత్తురు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ప్రమాదవశాత్తు కాలిపోతే అక్కడ స్థానిక సర్పంచ్ రాజకీయం చేయాలనుకున్నాడని ఆరోపించారు రామయ్య. ఈ కుట్రలో జగన్ భాగస్వామి.. జగనే స్క్రీప్ట్ రాసినట్లు ఆరోపించారు.






