విశాఖ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాలి

Spread the love

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్‌ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థల్లు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్‌తో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్‌తో స్థానిక టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. వీటితో పాటు 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

రామాయపట్నం సమీపంలో వస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతో పాటు ఆర్సెలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యే వరకూ పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక అధికారులను నియమించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు లాజిస్టిక్స్‌ను ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం లాంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2028 నాటికల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్‌తో పాటు సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *