సీజేఐ గ‌వాయ్ స్పందించిన తీరు భేష్

ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ

హైద‌రాబాద్ : ఈ దేశంలో ద‌ళితులు, బ‌హుజ‌నులు ఉన్న‌త ప‌ద‌వుల‌లో నెల‌కొంటే త‌ట్టుకోలేక పోతున్నార‌ని, ఇందులో భాగంగానే దాడుల‌కు తెగ బ‌డుతున్నారంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ ని ల‌క్ష్యంగా చేసుకుని న్యాయ‌వాది రాకేష్ కిషోర్ బూటు విస‌ర‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంద‌కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పూర్తిగా ప్ర‌జాస్వామ్యంపై, భార‌త రాజ్యంగంపై జ‌రిగిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌పై బూటుతో దాడి చేయ‌డం ప‌ట్ల జ‌స్టిస్ గ‌వాయ్ స్పందించిన తీరు అత్యంత హుందాక‌రంగా, గౌర‌వనీయంగా ఉంద‌న్నారు. ఇలాంటి దాడులు త‌మ‌కు కొత్త కాదంటూనే కేసుల‌ను వాదించ‌డం ఆయ‌నకు చ‌ట్టం ప‌ట్ల‌, భార‌త ప్రజాస్వామ్యం ప‌ట్ల‌, రాజ్యాంగం ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను, నిబద్ద‌త‌ను తెలియ చేస్తుంద‌న్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదని ధ్వ‌జ‌మెత్తారు. అందుకే ఈ దాడికి తెగ పడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజాస్వామిక స్ఫూర్తి మీద జ‌రిగిన దాడి అని పేర్కొన్నారు మంద‌కృష్ణ మాదిగ‌.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *