జ‌గ‌న్ రెడ్డి దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం కాకుండా కాపాడాం

మంగ‌ళగిరి : విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు టీడీపీ పార్టీ చీఫ్ , గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా రూ.11,440 కోట్లు సాధించామ‌న్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడామ‌ని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను మేనేజ్ మెంట్, కార్మిక సంఘాలు లాభాల బాటలో తేవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రం సహకారం అందిస్తామ‌న్నారు. 32 సెక్షన్లను ప్రైవేట్ పరం చేయడం లేదని స్ప‌ష్టం చేశారు. ఇప్పటికీ కాంట్రాక్టర్లే అక్కడ పని చేస్తున్నారని తెలిపారు. 1000 మంది 32 భాగాలుగా పనిచేస్తున్నార్నది జగన్ రెడ్డి గమనించాలని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తుండ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.

శ‌నివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడారు. జగన్ రెడ్డి చేసిన‌ పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. కల్తీ మద్యం మొత్తం కుంభకోణం జగన్ రెడ్డి ప్రోత్సహించిందే నంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కొందరు వైసీపీ ముసుగు వేసుకొని టీడీపీలోకి వచ్చారని, వాళ్లను ప్రక్షాళన చేస్తున్నాం అన్నారు. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష వేస్తామ‌న్నారు. తప్పు చేశారనే పార్టీ నుంచి కల్తీమద్యం కేసులో సస్పెండ్ చేశామ‌న్నారు. జగన్ రెడ్డి తన హయాంలో కల్తీ మద్యం కుంభకోణం బయట పడినా ఒక్క వైసీపీ నేతపై కూడా చర్యలు తీసుకోలేదని మండిప‌డ్డారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *