31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

ప్ర‌క‌టించిన టై ప్రెసిడెంట్ రాజేష్ ప‌గ‌డాల‌

హైద‌రాబాద్ : భారీ అంచ‌నాల మ‌ధ్య అక్టోబ‌ర్ 31వ తేదీతో పాటు న‌వంబ‌ర్ 1న రెండు రోజుల పాటు
హైదరాబాద్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2025 జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని టై అధ్య‌క్షుడు రాజేష్ ప‌గ‌డాల బుధ‌వారం వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ స‌ద‌స్సులో 1,500 మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఇందులో 100 వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌సంగిస్తార‌ని, 25 మంది కీ నోట్ , ప్యానెల్ లీడ‌ర్స్ ఈ స‌మ్మిట్ లో పాల్గొంటార‌ని వెల్ల‌డించారు . మాదాపూర్‌లోని HITEXలో రెండు రోజుల పాటు హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (HES 2025)ను నిర్వహించనున్నట్లు స్ప‌ష్టం చేశారు రాజేష్ ప‌గ‌డాల‌.

ఇది ప్ర‌ధానంగా వ్యాపారం, ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించేందుకు ఒక వేదిక‌గా ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు. హైదరాబాద్ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, అవ‌కాశాల‌కు కేరాఫ్ గా మారింద‌న్నారు. సాంకేతికత, ప్రతిభ , పట్టుదల మిశ్రమంత ఈ నగరం 2035 వైపు భారతదేశ వ్యవస్థాపక తరంగాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమ్మిట్ ప్ర‌ధానంగా ఏఐ, డీప్ టెక్ , ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, పెట్టుబడి, నిధులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఏరోస్పేస్, స్థిరత్వం, వ్యవసాయ, ఆహార సాంకేతికత, కుటుంబ వ్యాపారాలు, జీసీసీలు, కార్పొరేట్ ఆవిష్క‌ర‌ణ‌లు, లాజిస్టిక్స్ , ఆటోమోటివ్ , మొబిలిటీ, రిటైల్, కన్స్యూమర్ టెక్, మీడియా , వినోదం, విద్య , ఎడ్‌టెక్, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, మహిళలు, విద్యార్థి, సామాజిక వ్యవస్థాపకత, పాలసీ, నియంత్రణ, త‌దిత‌ర రంగాల‌పై ఫోక‌స్ పెడుతుంద‌న్నారు.

Related Posts

తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *