జోగి రమేష్ సిట్ ముందుకు రా
విజయవాడ : జగన్ , జోగి రమేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనీయర్ నేత బుద్దా వెంకన్న.
ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని, ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. మరి జగన్ నిద్ర పోతున్నాడా, జోగి రమేష్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరడజను దొంగలు వైసిపి లో ఉన్నారని ఆరపించారు. కొడాలి నానీ, పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి, వల్లభనేని వంశీ వీరంతా గత సర్కార్ హయాంలో రెచ్చి పోయారని, నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. మహిళలను సైతం చూడకుండా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు అని చెప్పకుండా ప్రోత్సహించిన నీచ చరిత్ర జగన్ ది అని ఆరోపించారు. చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మాకు చెప్పారని అందుకే సంయమనం పాటించామన్నారు . నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వెనుక ఇంకా పెద్దలు ఉన్నారని ఆరోపించారు. రమేష్ ని అరెస్టు చేసి విచారణ చేస్తే వారి పేర్లు బయటకు వస్తాయన్నారు. సూపర్ సిక్స్ ద్వారా కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం, భరోసా పెరిగాయన్నారు. వీటి నుంచి డైవర్టు చేసేందుకు నకిలీ మద్యం తయారు చేయించి కూటమి ప్రభుత్వం పై బురద జల్లాలని కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. గత వైసిపి ప్రభుత్వం నుంచే ఈ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టారని ఆరోపించారు. అప్పుడు వారిని అడ్డు కోకుండా ప్రోత్సహించి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.






